Ghibli-Style AI Images: GPT-4o తో గిబ్లి-శైలి చిత్రాలు.. ఇపుడు నెట్టింట ఇదే ట్రెండ్! 5 d ago

ఓపెన్ AI విడుదల చేసిన సరికొత్త GPT-4o ఇమేజ్ జనరేషన్ టూల్.. డిజిటల్ కళా ప్రపంచంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఓపెన్ AI లాంచ్ చేసిన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇది మనం అందించే ఫోటోలను గిబ్లి-శైలి ఫోటోలుగా మారుస్తూ బాగా ఫేమస్ అయ్యింది. ఇది విడుదల చేసిన ఒక్క రోజులోనే ప్రజల్లో విపరీతమైన ఆదరణను పొందింది.
ఈ టూల్ జనరేట్ చేసిన యానిమేటెడ్ గిబ్లి-శైలి చిత్రాలకు నెటిజన్లు బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఒక చిన్న ప్రాంప్ట్ తో మన సాధారణ ఫోటోలను గిబ్లి-శైలి ఫొటోలుగా మార్చుకోవచ్చు అంటే..చాల గొప్ప విషయమే కదా.. కాబట్టి చాలా మంది యూజర్ లు తమ యానిమేటెడ్ గిబ్లి-శైలి ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
అసలు గిబ్లి-శైలి చిత్రాలంటే ఏమిటి.?
నిజానికి గిబ్లి-శైలి చిత్రాలు అంటే ఒక జపనీస్ యానిమేషన్ స్టూడియో రూపొందించిన చిత్రాలు. 'స్టూడియో గిబ్లి' అనే జపనీస్ యానిమేషన్ స్టూడియో...తను తయారు చేసిన యానిమేటెడ్ చిత్రాలకు... గిబ్లి-శైలి చిత్రాలు అనే పేరు వచ్చింది.
1988 లో వచ్చిన "మై నైబర్ టోటోరో" (My Neighbor Totoro), 2001 లో వచ్చిన "స్పిరిటెడ్ అవే" (Spirited Away) వంటి యానిమేటెడ్ ఫాంటసీ చిత్రాల వల్ల... ఈ గిబ్లి-శైలి ఫోటోలకు చాలా మంచి పేరు వచ్చింది. హయావో మియాజాకి (Hayao Miyazaki) మొదటగా ఈ చిత్రాలను రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ చిత్రాలు అద్భుతమైన రంగులతో అందంగా ఉండటం వలన.. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
సాధారణంగా ఈ చిత్రాలను తయారు చెయ్యడం కష్టంతో కూడుకున్న పని.. దీనికి చాల సమయం పడుతుంది. కానీ ఓపెన్ AI GPT-4o ఇమేజ్ జనరేషన్ మోడల్ వంటి AI టూల్ లు ఈ చిత్రాలను చాలా సులభంగా.. వేగంగా అందిస్తున్నాయి.
గిబ్లి-శైలి చిత్రాలను సృటించడం సాధారణంగా చాలా కష్టం..AI సహాయంతో వీటిని రూపొందించడం సులభం అయ్యింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఓపెన్ AI ని వాడి గిబ్లి-శైలి చిత్రాలు సృష్టించడం చాలా సులువు. ఈ స్టైల్ చిత్రాలను ఎలా చెయ్యాలో ... చూడండి ఒకసారి..!
ముందుగా chatgpt.com లో లాగిన్ అయి, GPT-4o మోడ్ ఎంచుకోండి... టెక్స్ట్ బార్ లో మీ చిత్రం కానీ మీరు మార్చాలనుకున్న చిత్రాన్ని అప్‌లోడ్ చేసి, "గిబ్లి స్టైల్ లో మార్చు" అని ప్రామ్ట్ ను ఇవ్వండి. ChatGPT జనరేట్ చేసిన చిత్రం చూసి...ఏమైనా మార్పులు ఉంటే చేసుకుని…డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంతే మీ ఫోటోను గిబ్లి-శైలి ఫొటోలుగా మార్చడం ఇప్పుడు క్షణాల్లో పని. ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చేసి చూడండి.
ఇది చదవండి: డిజిటల్ చెల్లింపుల కోసం ఒక స్మార్ట్ ఎంపిక! దీంతో స్కామర్ల మోసాలకు చెక్!